శ్రీ గోవింద నామాలు

శ్రీ గోవింద నామాలు


గోవిందా హరి గోవిందా ।
గోకులనందన గోవిందా ।

శ్రీ శ్రీనివాసా గోవిందా ।
శ్రీ వేంకటేశా గోవిందా ।
భక్తవత్సలా గోవిందా ।
భాగవతప్రియ గోవిందా ॥ 1 ॥

నిత్యనిర్మలా గోవిందా ।
నీలమేఘశ్యామ గోవిందా ।
పురాణపురుషా గోవిందాపుండరీకాక్ష గోవిందా ।
పుండరీకాక్ష గోవిందా ॥ 2 ॥

నందనందనా గోవిందా ।
నవనీతచోర గోవిందా ।
పశుపాలక శ్రీ గోవిందా ।
పాపవిమోచన గోవిందా ॥ 3 ॥

దుష్టసంహార గోవిందా ।
దురితనివారణ గోవిందా ।
శిష్టపరిపాలక గోవిందా ।
కష్టనివారణ గోవిందా ॥ 4 ॥

వజ్రమకుటధర గోవిందా ।
వరాహమూర్తి గోవిందా ।
గోపీజనలోల గోవిందా ।
గోవర్ధనోద్ధార గోవిందా ॥ 5 ॥

దశరథనందన గోవిందా ।
దశముఖమర్దన గోవిందా ।
పక్షివాహన గోవిందా ।
పాండవప్రియ గోవిందా ॥ 6 ॥

మత్స్య కూర్మ గోవిందా।
మధుసూదన హరి గోవిందా ।
వరాహ నరసింహ గోవిందా ।
వామన భృగురామ గోవిందా ॥ 7 ॥

బలరామానుజ గోవిందా ।
బౌద్ధకల్కిధర గోవిందా ।
వేణుగానప్రియ గోవిందా ।
వేంకటరమణా గోవిందా ॥ 8 ॥

సీతానాయక గోవిందా ।
శ్రితపరిపాలక గోవిందా ।
దరిద్రజనపోషక గోవిందా ।
ధర్మసంస్థాపక గోవిందా ॥ 9 ॥

అనాథరక్షక గోవిందా ।
ఆపద్బాంధవ గోవిందా ।
శరణాగతవత్సల గోవిందా ।
కరుణాసాగర గోవిందా ॥ 10 ॥

కమలదళాక్ష గోవిందా ।
కామితఫలదా గోవిందా ।
పాపవినాశక గోవిందా ।
పాహి మురారే గోవిందా ॥ 11 ॥

శ్రీముద్రాంకిత గోవిందా ।
శ్రీవత్సాంకిత గోవిందా ।
ధరణీనాయక గోవిందా ।
దినకరతేజా గోవిందా ॥ 12 ॥

పద్మావతిప్రియ గోవిందా ।
ప్రసన్నమూర్తీ గోవిందా ।
అభయహస్త గోవిందా ।
అక్షయవరద గోవిందా ॥ 13 ॥ మత్స్యావతారా

శంఖచక్రధర గోవిందా ।
శార్ఙ్గగదాధర గోవిందా ।
విరజాతీర్థస్థ గోవిందా ।
విరోధిమర్దన గోవిందా ॥ 14 ॥

సాలగ్రామధర గోవిందా ।
సహస్రనామా గోవిందా ।
లక్ష్మీవల్లభ గోవిందా ।
లక్ష్మణాగ్రజ గోవిందా ॥ 15 ॥

కస్తూరితిలక గోవిందా ।
కాంచనాంబరధర గోవిందా ।
గరుడవాహన గోవిందా ।
గజరాజరక్షక గోవిందా ॥ 16 ॥

వానరసేవిత గోవిందా ।
వారధిబంధన గోవిందా ।
సప్తగిరీశా గోవిందా । ఏడుకొండలవాడ
ఏకస్వరూపా గోవిందా ॥ 17 ॥

శ్రీ రామకృష్ణా గోవిందా ।
రఘుకులనందన గోవిందా ।
ప్రత్యక్షదేవా గోవిందా ।
పరమదయాకర గోవిందా ॥ 18 ॥

వజ్రకవచధర గోవిందా ।
వైజయంతిమాల గోవిందా ।
వడ్డికాసులవాడ గోవిందా ।
వసుదేవతనయా గోవిందా ॥ 19 ॥

బిల్వపత్రార్చిత గోవిందా ।
భిక్షుకసంస్తుత గోవిందా ।
స్త్రీపుంరూపా గోవిందా ।
శివకేశవమూర్తి గోవిందా ॥ 20 ॥

బ్రహ్మాండరూపా గోవిందా ।
భక్తరక్షక గోవిందా ।
నిత్యకళ్యాణ గోవిందా ।
నీరజనాభ గోవిందా ॥ 21 ॥

హథీరామప్రియ గోవిందా ।
హరిసర్వోత్తమ గోవిందా ।
జనార్దనమూర్తి గోవిందా ।
జగత్సాక్షిరూప గోవిందా ॥ 22 ॥

అభిషేకప్రియ గోవిందా ।
ఆపన్నివారణ గోవిందా ।
రత్నకిరీటా గోవిందా ।
రామానుజనుత గోవిందా ॥ 23 ॥

స్వయంప్రకాశా గోవిందా ।
ఆశ్రితపక్ష గోవిందా ।
నిత్యశుభప్రద గోవిందా ।
నిఖిలలోకేశ గోవిందా ॥ 24 ॥

ఆనందరూపా గోవిందా ।
ఆద్యంతరహితా గోవిందా ।
ఇహపరదాయక గోవిందా ।
ఇభరాజరక్షక గోవిందా ॥ 25 ॥

పరమదయాళో గోవిందా ।
పద్మనాభహరి గోవిందా ।
తిరుమలవాసా గోవిందా ।
తులసీవనమాల గోవిందా ॥ 26 ॥

శేషసాయినే గోవిందా ।
శేషాద్రినిలయా గోవిందా ।
శ్రీనివాస శ్రీ గోవిందా ।
శ్రీ వేంకటేశా గోవిందా ॥ 27 ॥

గోకులనందన గోవిందా ।
గోవిందా హరి గోవిందా ।

Post a Comment

0 Comments